నర్సింహులపేట మార్చి 21 : విద్యుత్ వైర్ తో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి(Man dies ) చెందిన సంఘటన మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో చోటు చేసుకు కుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పార్నంది మోహన్ (33) శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని ఆకేరు వాగులోని నీటి కుంటలో విద్యుత్ వైర్‌తో చేపలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మ్పతుడికి భార్య పిల్లలు ఉన్నారు. మ్పతుడిభార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మాలోతు సురేశ్ తెలిపారు. మోహన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.