Errabelli Dayakarrao | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామ రైతులు నీటి లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనీ, పాలేరు(బయ్యాన్న) వాగులో నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కర్కాల రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు తక్షణమే కర్కాల గ్రామానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
పొలాలను, పాలేరు(బయ్యాన్న) వాగును సందర్శించిన ఆయన అధికారులతో చర్చించి వెంటనే వాగులోకి నీటిని విడుదల చేయించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివెరిసింది. ఇందుకు కృతజ్ఞతగా రైతులు ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రైతులు మాట్లాడుతూ.. దయాకర్ రావు హయాంలో పాలేరు వాగుపై మూడు డ్యామ్లు నిర్మించడంతో గత పదేళ్లుగా నీటి సమస్య లేకుండా సాగు చేసుకున్నామని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాగులో నీటిని విడుదల చేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎర్ర రామరెడ్డి, మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి,రాము,కుమార్ గౌడ్,వెంకన్న,అశోక్,రాజీ రెడ్డి, వెంకన్న, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, వీర సోమయ్య, రాజయ్య, వెంకన్న, గోపయ్య, మల్లారెడ్డి, రాజలింగం, అశోక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ
Maha Kumbh Mela | మాఘ పౌర్ణమి.. 1.83 కోట్ల మంది పుణ్యస్నానాలు