మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాక్షి సంతకం కోసం వచ్చి గుండె నొప్పితో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కురవి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మండలంలోని బలపాల లింగ్యాతండాకు చెందిన రైతు రునావల్ అనంతరాములు(55) తన బంధువుల రిజిస్ట్రేషన్ పనిమీద సాక్షి సంతకం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు.
సంతకాలు చేసిన తరువాత గుండె నొప్పి రావడం తో బయటకు వెళ్లి చెట్టు కింద కూర్చుని కింద పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు 108 వాహనానికి సమాచారం అందించారు. వారు పరిశీలించి అనంతరాములు చెందినట్లు నిర్ధారించారు. అనంతరాములు మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.