నర్సింహులపేట, ఫిబ్రవరి 13 : యాసంగి వరిపంటకు సాగు నీటి కష్ణాలు మొదలయ్యాయి. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ కాలువలో నీరు వారానికి ఒకసారి వస్తుండం.. ఎండిన కాలువ తడవడం వరకే సరిపోతున్నది. చెరువుల్లోకి సాగునీరు వచ్చే అవకాశం లేక పోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం, యాసంగికి పెట్టుబడి సాయం అందక,యాసంగి వరి పైరు కండ్ల ముందే ఎండిపోయే(Crops drying) అవకాశం ఉందని ఆవేదని రైతులు వ్యక్తం చేస్తున్నారు. వరిపైరు ఎండిపోకుండా ఉండేందుకు బావులు తవ్వుతున్నారు.
వేలకు వేల రూపాయాలు ఖర్చు చేసి బావుల్లో పూడికతోపాటు క్రేన్ సహాయంతో లోతు తవ్విస్తున్నారు.
ఐదేళ్లుగా ఇలాంటి పరిస్థితి లేదనివ వాపోతున్నారు. గత ఐదేళ్లుగా బావిలో నీరు తగ్గిందిలేదు. పంట ఎండిపోయింది లేదు. వరి వేసి రెండు నెలలైయింది. ఇప్పుడే పంటకు నీరుఅందక ఇబ్బంది అవుతందని రూప్లాతండాకు చెందిన గుగులోతు గింధీ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఇలాగైతే పంటలు పండటం కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సాగు నీరు అందించేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.