బయ్యారం, జూలై 2: దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూమికి పట్టా ఇచ్చిన కేసీఆర్పై (KCR) ఓ గిరిజన రైతు అభిమానాన్ని చాటుకున్నాడు. వరి నారుతో కేసీఆర్ పేరు రాసి తమ గుండెల్లో నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని ఎప్పటికీ తొలగించలేరని చాటిచెప్పాడు. బయ్యారం మండలం కస్తూరి నగర్ గ్రామానికి చెందిన బాదవత్ రవి పోడు భూమిని దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్నాడు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు అందించారు. దీంతో వర్షాలు పడి పంటలు సాగు చేస్తున్న వేళ.. రైతు బాంధవుడిని గుర్తు చేసుకుంటూ తన పొలంలోని వరి నారుతో కేసీఆర్ పేరుని రాసి బీఆర్ఎస్ అధినాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటాడు. రైతు పక్షపాతి అయిన కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతుల జీవితాల్లో వెలుగు నింపారని గుర్తుచేశాడు.