హనుమకొండ, నవంబర్ 12: ఈనెల 13, 14 తేదీల్లో భోపాల్‌లోని సెజ్ యూనివర్సిటీలో జరిగే ఇంటర్ స్టేట్ జూడో (పురుషుల) పోటీలకు కాకతీయ యూనివర్సిటీ టీంను ఎంపిక చేసిన్నట్లు విశ్వవిద్యాలయ క్రీడాకార్యదర్శి వై.వెంకయ్య తెలిపారు. వీరిలో విశ్వవిద్యాలయ వ్యాయమ కళాశాల నుంచి ఎం.సాయి కిరణ్ నాయక్, హనకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి ఎల్.లక్ష్మణ్, ఎం.ధీరజ్, వాగ్దేవి డిగ్రీ కాలేజీ నుంచి పి.శివాజీ, ఎల్బీ కాలేజీ నుంచి ఎం.ధర్శిత్నాయక్, వరంగల్ సీకేఎం కాలేజీ నుంచి బి.జయదీప్ ఉన్నట్లు వీరికి హనంకొండ వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వ్యాయమ అధ్యాపకుడు పి.కిషన్ కోచ్-కం-మేనేజర్‌గా వ్యవహరిస్తారని వెంకయ్య వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
K-pop star HyunA | మ్యూజిక్ షో మధ్యలో వేదికపై కుప్పకూలిన కే-పాప్ స్టార్.. వీడియో వైరల్
Kidney Rocket | ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. మదనపల్లె కేంద్రంగా దందా!