HyunA Update | తన పాటలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దక్షిణ కొరియా పాప్ స్టార్, కే పాప్ (K-pop) సెన్సేషన్ హ్యూనా (HyunA) ఇటీవల తన మ్యూజిక్ కన్సర్ట్‌లో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలింది. తన ‘Waterbomb 2025 Macau’ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రదర్శనలో ‘Bubble Pop!’ పాట గానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఘటన జరిగిన వెంటనే నిర్వహాకులు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
హ్యూనా పడిపోవడానికి గల ముఖ్య కారణం ఆమె బరువుని తెలుస్తుంది. ఇటీవల హ్యూనా ఎటువంటి ఆహారం తీసుకోకుండా మందులు తీసుకుని వేగవంతంగా 10 కిలోలు బరువు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ కారణం వలనే హ్యూనా పడిపోయినట్లు తెలుస్తుంది. హ్యూనా ప్రస్తుతం కోలుకుంటుడగా.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కన్సర్ట్లు, ఫేమ్ కంటే హ్యూనా ఆరోగ్యం శ్రేయస్సే మాకు ముఖ్యం. దయచేసి ఆమె తనపై ఒత్తిడి తగ్గించుకోవాలి అని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు హ్యూనా సిబ్బంది ఆమె ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించలేదంటూ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలావుంటే తాజాగా కోలుకున్న హ్యూనా ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. మ్యూజిక్ కన్సర్ట్‌లో ఇలా జరగడం వలన నేను చాలా బాధపడుతున్నాను. మీరు అంత డబ్బు ఖర్చు చేసి వచ్చినా, నేను ప్రొఫెషనల్‌గా లేకపోయాను. ఈ విషయంపై మీకు క్షమాపణలు చెబుతున్నానంటూ చెప్పుకోచ్చింది.
HyunA has fainted during performance, now she feels okay and has posted about her health condition via Instagram.#HyunApic.twitter.com/0Oqa80WqZH
— KoreadeoK (@koreadeok) November 9, 2025