KTR | వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ సొసైటీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న మహిళా రైతులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ బాధలను కేటీఆర్కు చెప్పుకున్నారు. ప్రభుత్వం దిగొచ్చే దాకా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.
అనంతరం కేటీఆర్ అక్కడి నుంచి నర్సంపేటకు బయలుదేరారు. మరికొద్ది సేపట్లో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో రైతులను కలవనున్నారు. అటు నుంచి ఇటీవల ఆత్మ బలిదానం చేసుకున్న ఆర్టీసీ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ సొసైటీలోని మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కేటీఆర్
చాలా రోజుల నుండి ఇక్కడే ఉన్నామని, వర్షం పడితే మా పరిస్థితి ఏంటని తమ అవేదన చెప్పుకున్న రైతులు pic.twitter.com/QRdwO2CtVG
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2026