చిట్యాల, మార్చి 18 : బైకు అదుపుతప్పి(Bike accident )యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని లక్ష్మీపూర్ తండా గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పోతనవేన అజయ్ కుమార్(24) పనుల నిమిత్తం చిట్యాల మండలం వైపు వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో మండలంలోని ఒడితల గ్రామ ప్రధాన రహదారి నుండి భూపాలపల్లి మండలం మొరంచవైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లక్ష్మీపూర్ తండా గ్రామం వద్ద బైక్ అదుపుతప్పి కిందపడటంతో గాయాలపాలయ్యాడు.
గమనించిన స్థానికులు108 వాహనానికి కాల్ చేశారు. కాగా అంబులెన్స్‌లో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల దవాఖానకు తరలించగా అప్పటికే అజయ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి వీరేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. అజయ్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.