కాళేశ్వరం: మావోయిస్టు బంద్ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం గోదావరి నదిపై గల అంతర్ రాష్ట్ర వంతెన వద్ద హై అలర్టు విధించింది. అలాగే గోదావరి నది పరివాహక ప్రాంతంపై డేగకన్ను వేసింది. ఈనేపథ్యంలో బుధవారం కాళేశ్వరం వద్ద అంతర్ రాష్ట్ర వంతెన పై ఎస్సై సాయిప్రసన్న ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వంతెన మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్నారు.
కాగా పీఎల్జీఏ బంద్ సందర్భంగా మావోయిస్టు నక్సలైట్లు ఏ క్షణంలోనైనా గోదావరి నది దాటి ఇటువైపు వచ్చే అవకాశం ఉండటంతో అంతర్ రాష్ట్ర వంతెన వద్ద ప్రత్యేక పోలీస్ బలగాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వచ్చిపోయే వాహనాలను పూర్తిగా తనిఖీ చేసి నిర్ధారణ అయ్యాకనే విడిచిపెడుతున్నారు. అలాగే మావోయిస్టు మాజీ నక్సలైట్ల కదలికలపై కూడా ఆరా తీస్తున్నారు. నక్సలైట్లకు అత్యంత ప్రభావితంగా ఉన్న గ్రామాలపై డేగకన్ను వేసి ఉంచారు.ఏఎస్సై రాజేశం తదితరులు ఉన్నరు.