Bhupalapalli | గుండెపోటుతో సింగరేణి కార్మికుడు మృతి.. ఆందోళన చేపట్టిన కార్మిక సంఘాలు
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే -1వ గనిలో రాత్రి షిఫ్టులో గోపాలం గోపి (కోల్ కట్టర్) అనే కార్మికునికి గుండెపోటు రాగా తోటి కార్మికులు ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి ఏరియాలోని కేటీకే -1వ గనిలో రాత్రి షిఫ్టులో గోపాలం గోపి (కోల్ కట్టర్) అనే కార్మికునికి గుండెపోటు రాగా తోటి కార్మికులు ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే గోపి మృతి చెందాడని ఆరోపిస్తూ సింగరేణి కార్మికులు భూపాలపల్లి ఏరియా సింగరేణి హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. సింగరేణి కార్మికులు చేస్తున్న ధర్నాకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి కార్మికుని మరణాన్ని మైన్ డెత్ గా పరిగణించాలన్నారు. కార్మికుని కుటుంబానికి ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు అందేలా చూడాలని, కార్మికునీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడితల సమ్మయ్య, రత్నం అవినాష్ రెడ్డి, మల్లారెడ్డి తో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయా సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

