Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10కు రంగం సిద్ధం.. టైమింగ్స్‌లో భారీ మార్పులు, హౌస్‌లోకి 16 మంది!
Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్ తెలుగు 10’ గ్రాండ్ లాంచ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో.. ఇప్పుడు పదో సీజన్‌తో మరింత గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ల్యాండ్‌మార్క్ సీజన్ కావడంతో ఈసారి కంటెస్టెంట్లు, టాస్కులు, కాన్సెప్ట్‌తో పాటు ప్రసార సమయాల్లోనూ కీలకమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
Bigg Boss 10 | తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్ తెలుగు 10’ గ్రాండ్ లాంచ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో.. ఇప్పుడు పదో సీజన్‌తో మరింత గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ల్యాండ్‌మార్క్ సీజన్ కావడంతో ఈసారి కంటెస్టెంట్లు, టాస్కులు, కాన్సెప్ట్‌తో పాటు ప్రసార సమయాల్లోనూ కీలకమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకంగా ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి ఆటను చూపించబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
‘బిగ్‌బాస్ తెలుగు 10’ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 6, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లకు ఉండే భారీ హంగామాతో ఈసారి కూడా కొత్త సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.స్టార్ మా ఛానల్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా కూడా ఈ షో అందుబాటులోకి రానుంది. దీంతో టీవీ ప్రేక్షకులతో పాటు ఓటీటీ ఆడియన్స్‌ను కూడా ఒకేసారి ఆకట్టుకునేలా ఈ సీజన్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని సీజన్లుగా రాత్రి 10 గంటల సమయంలో బిగ్‌బాస్ డైలీ ఎపిసోడ్లు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ప్రేక్షకుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని టైమింగ్స్‌లో మార్పులు చేసినట్లు సమాచారం.
సోమవారం నుంచి శుక్రవారం వరకు డైలీ ఎపిసోడ్లు రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానున్నాయి. ఇక వీకెండ్లో నాగార్జున హోస్ట్ చేసే ప్రత్యేక ఎపిసోడ్లు శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతాయి.ప్రైమ్ టైమ్‌లోకి షోను తీసుకురావడం వల్ల కుటుంబ ప్రేక్షకులకు మరింత సులభంగా బిగ్‌బాస్‌ను చూసే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌లుగా వ్యవహరించిన సమయంలో షో రాత్రి 9:30 గంటలకు ప్రసారమైంది. ఆ రెండు సీజన్లకు మంచి ఆదరణ లభించింది. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత షో ప్రసార సమయం రాత్రి 10 గంటలకు మారింది. ఇప్పుడు పదో సీజన్లో మరోసారి 9:30 గంటల టైమింగ్‌ను తీసుకురావడంతో పాత బిగ్‌బాస్ అభిమానులకు కూడా ఇది ఆసక్తికరమైన మార్పుగా మారింది. ఈ టైమింగ్ మార్పు షోకు మరింత ఎక్కువ వ్యూయర్షిప్, టీఆర్పీ తీసుకొస్తుందా అనేది చూడాలి.
మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లోకి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. వీరిలో ప్రత్యేకమైన ‘అగ్నిపరీక్ష’ ప్రక్రియ ద్వారా ఎంపికైన ఆరుగురు సామాన్యులు ఉండగా.. మరో 10 మంది సెలబ్రిటీలు పోటీపడనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో, బిగ్‌బాస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ముఖేష్ గౌడ, జబర్దస్త్ నరేష్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, యాంకర్ వర్షిణి, అదిత్ అరుణ్, యాంకర్ సుధీర్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

