Mirzapur The Movie | ప్రముఖ వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ‘మీర్జాపూర్ ది మూవీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, రెండో రోజు కూడా అదే హవాను కొనసాగించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా రెండో రోజు దేశీయ మార్కెట్లో రూ. 31 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో రెండు రోజుల్లో భారత్లో దీని మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 56.75 కోట్లకు చేరాయి. కాగా.. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 50 కోట్ల మైలురాయిని దాటడం విశేషం. దీని ద్వారా దేశీయ గ్రాస్ వసూళ్లు రూ. 68.20 కోట్లకు చేరుకున్నాయి.
ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. రెండో రోజు విదేశాల్లో రూ. 6 కోట్లు రాబట్టడంతో, ఓవర్సీస్ గ్రాస్ మొత్తం రూ. 10.25 కోట్లకు చేరింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే రూ. 78.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి, రూ. 80 కోట్ల మార్కుకు చేరువయింది. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూలు వస్తుండటంతో థియేటర్లలోకి జనం భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ ‘టాక్సిక్’, ‘హనుమాన్ అంశ్’ సినిమాలతో పాటు అర్షద్ వార్సి ‘జీవన్ భీమా యోజన’ చిత్రాలతో మీర్జాపూర్ పోటీపడుతోంది.