Raaka | అల్లు అర్జున్ ‘రాకా’లో మరో కీలక నటుడు.. ‘యానిమల్’ ఫేమ్ బబ్లూ పృథ్వీరాజ్ కీలక పాత్ర!
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రిలీజ్ విషయంలో 2027 డిసెంబర్ 31 తేదీ తెరపైకి వచ్చినప్పటికీ.. దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రిలీజ్ విషయంలో 2027 డిసెంబర్ 31 తేదీ తెరపైకి వచ్చినప్పటికీ.. దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ కీలక విషయం మాత్రం అధికారికంగా బయటకు వచ్చింది. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ పృథ్వీరాజ్ ‘రాకా’లో నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ పృథ్వీరాజ్.. తాజాగా ఓ తెలుగు ఇంటర్వ్యూలో ‘రాకా’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. సినిమాలో తనకు ఓ ప్రముఖ పాత్రతో పాటు ప్రత్యేకమైన లుక్ ఉంటుందని తెలిపారు. దీంతో ‘రాకా’లో బబ్లూ పృథ్వీరాజ్ పాత్ర ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ‘రాకా’ షూటింగ్ అనుభవం గురించి కూడా బబ్లూ పృథ్వీరాజ్ మాట్లాడారు. దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయడం ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పిన ఆయన.. సినిమా మేకింగ్ భారీ స్థాయిలో ఉంటుందని సూచించారు.
అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ కోసం ఇంటర్నేషనల్ స్థాయి టెక్నికల్ టీమ్, హాలీవుడ్‌కు చెందిన నిపుణులు కూడా పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. సినిమా కాన్వాస్ ఎంత పెద్దదిగా ఉండబోతుందో ఈ వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో కలిసి ఇంత భారీ ప్రాజెక్ట్‌లో నటించడం తనకు ఎంతో ప్రత్యేకమైన విషయమని బబ్లూ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఇలాంటి భారీ కాన్వాస్ ఉన్న సినిమాలో భాగం కావడం తనకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాంటిదని చెప్పినట్లు తెలుస్తోంది.అయితే తన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. చిత్రబృందంతో చేసుకున్న ఒప్పందం కారణంగా సినిమా కథ, తన పాత్ర స్వభావం, లుక్ వంటి అంశాలపై మరిన్ని విషయాలు బయటపెట్టలేనని స్పష్టం చేసారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

