సంగెం/ఖానాపురం, మే 5: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ జీ సునీల్‌రెడ్డి తెలిపారు. సంగెం ప్రభుత్వ కళాశాల సెంటర్లో గవిచర్ల మోడల్‌స్కూల్ విద్యార్థులతోపాటు సంగెం కళాశాల విద్యార్థులు కలిపి 357 మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం 192, ద్వితీయ సంవత్సరం 165 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. సంగెంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్సై ఎస్ కిరణ్మయి తెలిపారు. అలాగే, ఖానాపురం మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ శేషాచారి తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 174 మంది పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.