మహాదేవపూర్: ఎంమ్మార్పీఎస్ (MRPS)మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో మహదేవ్‌పూర్‌లో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదిగల పట్ల చూపుతున్న వివక్షను మానుకోవాలన్నారు. నిండు అసెంబ్లీలో రేవంత రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదింపజేసిన తర్వాతనే గ్రూప్స్ పరీక్షల నియామకాలు చేపట్టాలన్నారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి, మాదిగలకు ప్రత్యక్ష పోరు తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పిందని ఆరోపించారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఉనికి చాటుకోవడానికి కూడా వీలు లేనంతగా మాదిగలు ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ తీరును మార్చుకొని వర్గీకరణ అయ్యేవరకు ప్రభుత్వ నియామకాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొలుగూరి రాజయ్య, బెల్లంపల్లి మల్లేష్, చింతకుంట్ల సదానందం, లింగాల సుశాంత్, బెల్లంపల్లి జాషువా, లింగాల సాగర్, తదితరులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు.