భూపాలపల్లి : పెండింగ్ ఫైళ్లను వేగంగా ,పారదర్శకంగా నిర్వహించి పెండింగ్ లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలోని వివిధ సెక్షన్లు, ఇతర శాఖల అధికారుల ఛాంబర్లను తనిఖీ చేసి ఫైళ్లను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల ను పరిశీలించి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అన్నారు. సింగరేణి, జెన్కో, ఇరిగేషన్, నేషనల్ హైవే తదితర ల్యాండ్ అక్విజిషన్ వివరాల ఫైళ్లను ప్రత్యేకంగా పొందుపరచాలని, పెండింగ్ లో లేకుండా చూడాలని అన్నారు.
ఫైల్స్ ఈ-ఆఫీస్ లో నిర్వహించేటప్పుడు డిజిటల్ సంతకంతో పంపించాలని అన్నారు. అనంతరం ల్యాండ్ సర్వే, ప్రణాళిక, సమాచార పౌరసంబంధాలు, బీసీ అభివృద్ధి, ఎస్సీ అభివృద్ధి, గ్రౌండ్ వాటర్, పంచాయతీ, పౌరసరఫరాలు, మహిళా శక్తి కేంద్రం, తదితర శాఖల కార్యాలయాలను సందర్శించి ఫైళ్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మహేష్‌బాబు, ఏడీ సర్వేల్యాండ్ సుదర్శన్, సీపీవో సామ్యూల్, డీపీఆర్వో రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.