మహాముత్తారం: పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల కోరుకు ధరఖాస్తులు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం మండలంలోని మినాజీపేట, రేగులగూడెం గ్రామాలలో అదనపు కలెక్టర్ దివాకర్‌తో కలిసి రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పోడు భూములకు దరఖాస్తులు ఎలాచేసుకోవాలనేదానిపై అవగాహన కల్పించారు.
పోడు భూముల ధరఖాస్తు ద్వారా సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని, రైతులు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మినాజీపేట సర్పంచ్ ముత్యాల రాజు, డీఎల్పీవో సుధీర్‌కుమార్, పెగడపల్లి ఎఫ్ఆర్వో సుష్మరావ్, ఎంపీడీవో రవీంద్రనాథ్, ఇంచార్జ్ తహసీల్ధార్ వినయ్‌సాగర్, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ రైతులు తదితరులు పాల్గొన్నారు.