సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యం
సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
- కాంగ్రెస్ కుట్రలతో ప్రశ్నార్థకంగా కార్మికుల పరిస్థితి
- ప్రభుత్వం మెడికల్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసే కుయుక్తులు
- సర్కారుకు ఏటీఎంలా మారిన సంస్థ
- భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
కృష్ణకాలనీ, జూన్ 9 : సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే -1 ఇంకె్లైన్ గని ఆవరణలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్‌కు గండ్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం సింగరేణిలో ఏం జరుగుతుందో తెలియక కార్మికులు సతమతమవుతున్నారన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో కార్మికులు అన్ని రకాల హకులను పొందారని, మెడికల్ బోర్డు నిర్వహణతో 13,500 మంది సింగరేణి కార్మికుల పిల్లలు ఉద్యోగాలు పొందారన్నారు. ఈ విషయం అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఒప్పుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి నుంచి ఇప్పటివరకు ఒక మెడికల్ బోర్డు కూడా నిర్వహించకపోగా గతంలో తప్పులు జరిగాయని తప్పుడు మాటలు మాట్లాడున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డును పూర్తిగా ఎత్తివేసే కుట్ర చేస్తున్నట్లు అధికారులు మాటలతో తేటతెల్లమవుతున్నదన్నారు. ఒకవేళ ఇదే జరిగితే యాజమాన్యంపై తిరగబడడానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సైతం కార్మికుల హకులను కాలరాస్తున్నాయన్నారు. కాంగ్రెస్ సర్కారు సింగరేణిని ఏటీఎంగా మార్చుకున్నదని, సంస్థకు సంబంధించిన రూ. 56 వేల కోట్లు వాడుకున్నదని మండిపడ్డారు. 16 శాతం ఉన్న లాభాల వాటాను కేసీఆర్ 34 శాతానికి పెంచి ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 1 లేదా 2 శాతం పెంచి ఆ డబ్బులు ఇవ్వడంలో కూడా కోత పెడుతున్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీఎం రేవంత్‌కు రైతులు, వారి సమస్యలపై ఏమాత్రం పట్టింపులేదన్నారు. హిట్లర్ వారసుల పాలన అవసరం లేదని, ప్రజాస్వామ్య పాలన కావాలన్నారు. కార్మికుల కోసం భూపాలపల్లిలోని రామప్ప కాలనీలో 1000, ఎండీలో మరో 1000 క్వార్టర్స్ నిర్మించామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభలో కోరిన మేరకు అర్హతను బట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిచ్చారన్నారు.
ఇప్పటికైనా సింగరేణి కార్మికులు కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టి టీబీజీకేఎస్ నాయకత్వాన్ని బలపర్చాలని గండ్ర కోరారు. ఈ నెల 12న భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్న సింగరేణి పరిరక్షణ సదస్సుకు మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు వస్తున్నారని, కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ సురేందర్‌రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు రత్నం అవినాష్‌రెడ్డి, దేవరకొండ మధు, ఏరియా వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్, కౌన్సిలర్లు బోగం నరేందర్, బొంతల సతీశ్‌కుమార్, కట్ల పూర్ణచందర్, నాయకులు కటకం జనార్దన్, సెగ్గం సిద్ధు, మాడ హరీశ్‌రెడ్డి, మేనం రాజేందర్, యుగేంద్రాచారి, జ్యోతుల వెంకన్న, టీబీజీకేఎస్ నాయకులు మల్లారెడ్డి, సురేశ్‌చారి, సాంబయ్య, సదానందం, బాలాజీ, ఆకుల కిషన్, రమేశ్, శ్రీనివాస్, కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

