SFI | బచ్చన్నపేట, ఆగస్టు 23 : బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం బచ్చన్నపేట మండల కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ.. బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక ఉన్నత చదువుల కొరకు విద్యార్థులు జిల్లా సెంటర్‌కు వెళ్లి చదువుకుంటున్నారని సమయానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ రాక రాష్ట్రంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసేంతవరకు ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని ముందుకు సాగిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరవింద్, అఖిల్ ,శ్రీధర్ ,కమల్, రాకేష్, అరవింద్ ,సతీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి : పిట్టల అశోక్
Peddapally | యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త శ్యామల
Sanjay Dutt | సంజూ భాయ్ అతడిని అలా కొట్టాడేంటి.. వైరల్ అవుతున్న వీడియో