హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) పార్టీ ఫిరాయించి న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవా రం స్పీకర్ వద్ద క్రాస్ ఎగ్జామినేషన్‌కు డుమ్మాకొట్టారు. స్పీకర్ ఆదేశాల మేరకు దానం నాగేందర్ శుక్రవారం అసెంబ్లీలో జరుగనున్న విచారణకు హాజరు కావాలి. ఫిర్యాదుదారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాదులు సంతోష్‌కుమార్, వెంకటేశ్వరరావు శాసనసభ ఆవరణలోని స్పీకర్ కార్యాలయానికి వచ్చారు. కానీ దానం నాగేందర్, ఆయన తరఫు న్యాయవాదులు ఎవ్వరూ రాలేదు. తదుపరి విచారణ మార్చి రెండో తేదీన జరుగనున్నది. మార్చి రెండో తేదీన బీఆర్ఎస్ న్యాయవాదుల మౌఖిక, రాతపూర్వక వాదనలను ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ స్వీకరించనున్నారు. అదేరోజున దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసు విచారణ పూర్తవుతుంది. పార్టీ ఫిరాయించిన మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసు విచారణ శనివారం జరుగనున్నది.