Power Transformer | బచ్చన్నపేట, అక్టోబర్ 10 : బచ్చన్నపేట్ సబ్ స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 5 MVA ట్రాన్స్ఫార్మర్ స్థానంలో 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఛార్జ్ చేశామని జనగాం డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభంతో బచ్చన్నపేట్ పరిధిలో విద్యుత్ సరఫరా మరింత సమర్థవంతంగా, నిరంతరాయంగా అందిస్తామని అన్నారు. వినియోగదార్లకు మెరుగైన సేవలు అందించే దిశగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
లక్ష్మీ నారాయణ రెడ్డి వెంట టెక్నికల్ డీఈ గణేష్ , డిఇ/ఎంఆర్టీ & కన్స్ట్రక్షన్ విజయ్, ఏడీఈ జనగాం వేణుగోపాల్ , టిఆర్ఈఏడీఈ శ్రీధర్ , ఏఈ బచ్చన్నపేట, ఏఈ రాజ్ కుమార్, ఏఈ టీఆర్ఇ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
Pending Fees | పెండింగ్ ఫీజులు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి
Tejashwi Yadav | ఆర్జేడీని గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం.. బీహారీలకు తేజస్వియాదవ్ హామీ
Penpahad : మానవాళి శ్రేయస్సుకే అంతరిక్ష ప్రయోగాలు : సీనియర్ సైంటిస్ట్ వెంకటరమణ