Bachhannapeta | బచ్చన్నపేట, డిసెంబర్ 27 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తున్నానని పడమటి కేశవపూర్ సర్పంచి ఎర్రోళ్ల విజయ సోములు అన్నారు. శనివారం గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు మూడు బోర్లు వేయగా రెండు సక్సెస్ అయ్యాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల విజయ సోములు మాట్లాడుతూ.. సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, అందులో భాగంగానే ఇచ్చిన హామీలు దశలవారీగా నెరవేరుస్తున్నానని చెప్పారు.
ప్రజలకు నీటి సౌకర్యం, వీధి దీపాల నిర్వహణ, పారిశుధ్య పనులు ప్రతీ రోజు నిర్వర్తించేలా చర్య తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలను తన సమస్యగా భావించి, వారికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో, గ్రామ సీనియర్ నాయకుడు చల్లా శ్రీనివాసరెడ్డి సూచనలతో ముందుకు సాగుతానని అన్నారు. ఐదేళ్లలో గ్రామ రూపురేఖలను మార్చి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఉప సర్పంచ్ వార్డు సభ్యుల సలహాలతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తానని అన్నారు. మిగిలిన హామీలు కూడా దశలవారీగా నెరవేర్చడంలో వెనకంజ వేయనని స్పష్టం చేశారు. ప్రజలకు భరోసా కార్డు కూడా ఇప్పించడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజలు ఐదేళ్లు తనకు పూర్తి సహకారం అందించాలని కోరారు. తనపై నమ్మకంతో సర్పంచిగా గెలిపించి మరింత బాధ్యత పెంచారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు చల్లా శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ తాడెం నరేందర్, నాయకులు గ్రామ చల్లా తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు రాజుపేట గోపాల్, వేముల మహదేవ్, హరి, వార్డు సభ్యులు యాసరేని వెంకటేష్, పడమటి కేశవాపూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజుపేట గోపాల్ వేముల మహదేవ్, గర్నపల్లి వేణు, గంగరబోయిన రమేష్, వేముల హరీష్, మేకల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్టీ డౌన్.. 23 శాతం పడిపోయిన ఇండ్ల అమ్మకాలు
పాలమూరు ప్రాణం మీదికొస్తే శంఖారావమే!
Gold Price | ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ధర 1.42 లక్షలు