House Constructions | బచ్చన్నపేట, జూలై 31 : బచ్చన్నపేట మండలంలోని ఆయా గ్రామాలకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కోటాకింద మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి సూచించారు. గురువారం మండలంలోని నాగిరెడ్డిపల్లి, కేశిరెడ్డిపల్లి, గంగాపూర్, రామచంద్రాపూర్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలకు ముగ్గులు పోశారు.
ఈ సందర్భంగా కేశిరెడ్డిపల్లి గ్రామ సీనియర్ నాయకులు దూడల కనకయ్య, ఆముదాల మల్లారెడ్డి, వడ్డేపల్లి మల్లారెడ్డి, మల్లవరం వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడు ఇల్లు నిర్మాణం చేసుకుని సొంతిట్లో ఉండాలన్న ఆశయంతో ఇండ్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు పేద వారికే కేటాయించారని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్లు పూర్తి చేయాలన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి ఎంతో ఉందన్నారు. ఆయన సొంత ఆసుపత్రి నీలిమాలో ప్రతీ రోజు ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. పేదవారికి సైతం కార్పోరేట్ తరహాలో వైద్యం అందించే విధంగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతీ రోజు ఎంతో మంది ఆసుపత్రికి వెళ్లున్నారని అన్నారు. వారికి అన్ని రకాల పరీక్షలు, మందులు ఉచింతంగా అందించి పంపించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కర్నాల వేణుగోపాల్, కాపర్తి హరిప్రసాద్, ఉగ్గె చంద్రశేఖర్, బందారపు వినయ్‌కుమార్, సాయికుమార్, అంబదాసు, శ్రీహరి, జీవన్ రెడ్డి, అంజిరెడ్డి, కుమారస్వామి, హరిబాబు, బొడికె కృష్ణ, మాజీ సర్పంచ్ తాతిరెడ్డి భవానిశశిధర్రెడ్డి, సుశీల, అనిల్ రెడ్డి, నీల బాపిరాజు, రాములు, బందెల రాజు, ఆముదాల ఇంద్రారెడ్డి, వద్దుల మల్లయ్య, భైరగోని సంతోష్, భాస్కర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాధాక్రిష్ణ, నర్ర దామోదర్ రెడ్డి, ఆముదాల భూపాల్ రెడ్డి, మామిండ్ల భాస్కర్, నరేశ్, కంతి భాస్కర్, సయ్యద్, సార్ల కిష్టయ్య, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MEO Gajjela Kanakaraju | విద్యార్థులకు జీవ వైవిధ్యం పాఠ్యాంశాలు బోధించాలి : ఎంఈఓ గజ్జెల కనకరాజు
Child laborers | బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ మానస