జనగామ రూరల్ : జనగామ మండలం చీటకోడూరు గ్రామంలో బుధవారం మహా శివరాత్రిని పురస్కరించుకుని శ్రీపంచకోసు రామ లింగేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla) స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలోని శివలింగానికి అభిషేకాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోరికలు తీర్చే రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఆలయంలో మరిన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంది. వాటికి సంబంధించిన అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. జనగామ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Firearms Surrendered | సమీపిస్తున్న గవర్నర్ డెడ్లైన్.. ఆయుధాలు అప్పగిస్తున్న మణిపూర్ ప్రజలు
Shahrukh Khan | ‘మన్నత్’ను వీడి అద్దె ఇంటికి వెళుతున్న షారుఖ్ ఖాన్.. రెంట్ ఎంతో తెలుసా?
Samantha | అది నా ఫస్ట్ లవ్.. ఇక సినిమాలకు విరామం ఉండదు : సమంత