Shahrukh Khan – Mannat | బాలీవుడ్ బాద్షా, నటుడు షారుఖ్ ఖాన్ తన ఇంటి (మన్నత్)ని వీడబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. షారుఖ్ ఇల్లు మన్నత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబైలో ఉన్న మోస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లలో ఇది కూడా ఒకటి. షారుఖ్‌ని చూద్దామని వచ్చి అతడు కలవకపోయిన అతడి ఇంటిముందు ఫొటో దిగి వెళతారు అభిమానులు. ఇక షారుఖ్ కూడా తన బర్త్‌డే జరుపుకున్న ప్రతిసారి ఈ ఇంటి బాల్కానీ మీదకి వచ్చి అభిమానులకు ధన్యవాదాలు చెబుతాడు. అయితే తాజా సమాచారం ప్రకారం షారుఖ్ మన్నత్()ని కొన్ని వీడబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ భవనం లోపల రెనోవేషన్ పనులు జరుగబోతున్నట్లు సమాచారం. అందుకే షారుక్ మన్నత్ని వదిలి అద్దె అపార్ట్మెంట్లోకి వెళుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ముంబయిలోని పాలి హిల్ ప్రదేశంలో ఉన్న ‘పూజా కాసా’ అనే భవనంలో రెండు డూప్లెక్స్ అపార్ట్మెంట్లను షారుఖ్ అద్దెకి తీసుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ రెండు ఆపార్ట్‌మెంట్లకు కలిపి ఏడాదికి దాదాపు రూ.2.9 కోట్లు షారుఖ్ అద్దె చెల్లించనున్నట్లు సమాచారం. మరోవైపు షారుఖ్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే నెలకు రూ.24 లక్షలు అద్దె చెల్లించినట్లు రిపోర్ట్స్ బయటకు వచ్చాయి.