చిల్పూర్ : చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కావటి మల్లయ్య మరణించగా వారి పార్థివదేహానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కావటి మల్లయ్య లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఎమ్మెల్యే వెంట మాజీ సర్పంచులు, కొయ్యడ రామదాసు, మామిడాల లింగారెడ్డి, మారబోయిన ఎల్లయ్య,నాయకులు, బొమ్మిశెట్టి బాలరాజ్, రంగు రమేష్, గుర్రం వెంకటేశ్వర్లు, ఉడుత వెంకన్న, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Minister | చర్చలో భాగంగా సిబ్బంది భుజంపై చేయివేసి.. పదవి పోగొట్టుకున్న మంత్రి
The Waking of a Nation | జలియన్ వాలాబాగ్ ఉదంతంపై వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా.!