Jallianwala Bagh Massacre | భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా నిలిచిపోయింది. జలియన్ వాలాబాగ్ ఉదంతం. బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉండటం విచారకరం. అయితే జలియన్ వాలా బాగ్ ఘటనను వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ‘ది వాకింగ్ ఆఫ్ ఏ నేషన్’ (The Waking of a Nation) అంటూ రాబోతున్న ఈ వెబ్ సిరీస్‌కు రామ్ మాద్వాని దర్శకత్వం వహిస్తుండగా తారుక్ రైనా (Taaruk Raina), నిఖితా దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీలివ్’ (Sonyliv)లో మార్చి 7 నుంచి ఈ హిస్టారికల్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుండగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మే్ర్స్ విడుదల చేశారు. జలియన్ వాలా బాగ్ నరమేధాన్ని బ్రిటిషర్లు ముందే ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.
ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్‌కు చేరుకున్నారు. ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం పాల్గొన్నారు. ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యాపాల్‌ను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. పంజాబ్‌లో యుద్ధ చట్టాన్ని అమలు చేసి, శాంతిభద్రతల బాధ్యతను బ్రిగేడియర్ జనరల్ డయ్యర్‌కు అప్పగించింది. ఆందోళనలు ఇంకా ఆగలేదు. రౌలాట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 13 న అమృత్‌సర్‌లోని జలియన్ వాలా బాగ్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 25 నుంచి 30 వేల మంది హాజరయ్యారు. జనరల్ డయ్యర్ తన దళాలతో అక్కడికి వచ్చి నిరాయుధ ప్రజలపై కాల్పులు జరుపుతానంటూ బెదిరించాడు. దాంతో అక్కడ గందరగోళం నెలకొన్నది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి పరుగెత్తటం ప్రారంభించారు. చాలా మంది తోటలోని బావిలోకి దూకారు. కాల్పులు సుమారు 10 నిమిషాలు కొనసాగాయి. ఇందులో వేయికి పైగా జనం మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.