జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరిగొప్పుల మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాల్ బాయ్ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరిన వారంతా కలిసి మెలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు.
బీఆర్ఎస్లో చేరినవారిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు సబావత్ రమేశ్, పార్టీ నాయకులు సబావత్ హనుమంతు, సబావత్ శ్రీనివాస్, భూక్యా తిరుపతి, జరుపుల రాములు, జరుపుల రాజు, జరుపుల భీముడు, కోడవత్ తిరుపతి, కోడవత్ పరుమేశ్, కోడవత్ సూర్య, పూల్యా, ఈర్య, సంతోష్, గణేష్, దాస్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు భూక్యా జూంలాల్ నాయక్, తాళ్లపల్లి పోషయ్య గౌడ్, మాజీ సర్పంచ్ రాజు, ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ కొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.