ఖిలావరంగల్, మే 19: గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ తూర్పుకోట ముదిరాజ్కాలనీలోని మంచినీళ్ల బావిపై ఐరన్ కప్పు నిర్మాణం పనులను చేపట్టారు. కాగా ఈ పనులను కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ పరిశీలించారు. కాకతీయుల నాటి మంచి నీళ్ల బావి సమీపంలో ప్రభుత్వ పాఠశాల ఉందని, చిన్న పిల్లలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని జీడబ్ల్యూఎంసీ నామినేషన్ పనులతో బావి చుట్టూ ఐరన్ గ్రిల్స్తోపాటు, పైకప్పు వేయించినట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోగి సురేష్, సంగరబోయిన చందర్, శ్యామ్, రాజేష్, కాంట్రాక్టర్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Spying | పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. నుహ్లో మరో వ్యక్తి అరెస్ట్