BRS Rajathotsava Sabha | దుగ్గొండి, ఏప్రిల్ 27: భారత రాష్ట్ర సమితి 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల పార్టీల కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి. అనంతరం ప్రాంతాల వారిగా సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది.. లక్ష్యాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్రం పురోగతి సాధించిన గులాబీ జెండా 25 వసంతాలు పూర్తిచేసుకుని తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. కేసిఆర్ నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పలు గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు జెండా ఆవిష్కరణలు చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జ్ కంచరగుంట్ల శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ ఊరటి మైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సింగతి రాజన్న, ప్రధాన కార్యదర్శి మెరుగు రాంబాబు, సంకేషి కమలాకర్, యూత్ అధ్యక్షుడు నగనబోయిన తిరుపతి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ నుంచి సభకు కదిలిన గులాబీ దండు
నెక్కొండ, ఏప్రిల్ 27 : నెక్కొండ మండలం నుంచి టీఆర్ఎస్ ఎల్కతుర్తి వద్ద నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు వేలాదిగా గులాబీ శ్రేణులు దండులా బయలుదేరాయి. మండలంలోని 39 గ్రామాల నుంచి 5,000 మంది ఆవిర్భావ దినోత్సవ వేడుకకు తరలి వెళుతున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగనీ సూరయ్య, మాజీ సొసైటీ చైర్మన్ మారం రాము, న్యాయవాది కొమ్ము రమేష్ యాదవ్ తెలిపారు.
మండలంలో బయలుదేరిన వాహనాల శ్రేణిని సంగనీ సూరయ్య జెండా ఊపి ప్రారంభించారు. బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకొని అనంతరం ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు బయలుదేరారు.
ఉత్సవ సభకు బయలుదేరిన వారిలో మాజీ సొసైటీ చైర్మన్లు మారం రాము, కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, న్యాయవాది అబ్దుల్ నబి జంపాల కేదారి, మాజీ ఉప సర్పంచ్ దేవనపైన వీరభద్రయ్య , పట్టణ అధ్యక్షుడు కొనిజేటి బిక్షపతి, మండల నాయకులు కారింగుల సురేష్ యాకయ్య, దాసరి శ్రీనివాస్, లెనిన్ , రాజు ,మహమ్మద్ ఖలీల్, మాజీ సర్పంచ్ మాదాసు రవి, మాజీ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు గ్రామ శాఖల బాధ్యులు అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పర్వతగిరి మండలంలో..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యేందుకు పర్వతగిరి మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు బయలుదేరారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి