Free eye Medical Camp | వరంగల్ చౌరస్తా : సర్వేంద్రీయానాం నయనం ప్రధానం అన్నది అక్షర సత్యమని, కంటి చూపు లేకుండా ఒక పూట కూడా జీవించలేమని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ అన్నారు. ఇవాళ వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే రామకృష్ణ ఆధ్వర్యంలో మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. నిత్యం విధి నిర్వహణలో భాగంగా ఎండ, వాన, దుమ్ము, ధూళితో పోరాటం చేస్తూ వాతావరణ కాలుష్యానికి గురయ్యే ట్రాఫిక్ పోలీసుల కోసం డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మెడికల్ క్యాంప్‌ను మన ట్రాఫిక్ సిబ్బంది అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం డా. ప్రధాన్ మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకు వైద్య సహాయం చేయడం కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
మొదటి దశలోనే సమస్యను గుర్తించినట్లైతే తక్కువ సమయంలో ఎక్కువ నష్టం కలుగకుండా జాగ్రత్త పడవచ్చునని అన్నారు. అధిక నిర్లక్ష్యం కారణంగా చూపు కోల్పోయే ప్రమాదం లేకపోలేదని అన్నారు. కంటిని కాపాడుకోవడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా.హరికృష్ణ, డా.యోగిని, పిల్లి రవి కుమార్, లక్ష్మీనారాయణ, విజయ్ కుమార్, యాదగిరి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు