జనగామ రూరల్ : క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం కలుగుతుందని మాజీ వైస్ ఎంపీపీ చౌదరిపల్లి శేఖర్ అన్నారు. ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల అల వడుతుందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. నేటి ఓటమి రేపు గెలుపులకు బాటలు వేస్తుందన్నారు. క్రీడాకాలంతా ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ మంగళంపల్లి రాజు, బీఆర్ఎస్ నాయకులు నల్ల రాహుల్, దొంగ కౌశిక్, ప్రవీణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli | ఆ ముగ్గురు చాలా టఫ్.. నేను ఎదుర్కొన్న కష్టమైన బౌలర్లు వీళ్లే..!
Red Fort: ఎర్రకోటపై దావా వేసిన మొఘల్ వారసురాలు.. పిటీషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు