Virat Kohli : ప్రపంచ క్రికెట్లో రికార్డుల వీరుడిగా పేరొందిన విరాట్ కోహ్లీ(Virat Kohli) ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో దంచికొడుతున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఉతికేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ను ప్లే ఆఫ్స్ దిశగా అడుగులేయిస్తున్నాడు. సమయాన్ని బట్టి గేర్ మార్చి ఆడుతున్న విరాట్ ఐపీఎల్లో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. అలాంటిది తనను అంతర్జాతీయ క్రికెట్లో భయపెట్టిన బౌలర్లు ఉన్నారంటున్నాడు కోహ్లీ. ఈ విషయాన్ని అతడు ఆర్సీబీ బోల్డ్ డైరీస్‌లో ఈమధ్యే వెల్లడించాడు.
ఐపీఎల్ 18వ సీజన్లో రెచ్చిపోయి ఆడుతున్న విరాట్ కోహ్లీ చిట్‌చాట్‌లో భాగంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మీరు ఎదుర్కొన్న కష్టమైన బౌలర్ ఎవరు అనే ప్రశ్నకు అతడు మూడు సమాధానాలు చెప్పాడు. అవును.. మూడు ఫార్మాట్లలో తనకు ముగ్గురు సవాల్ విసిరారని చెప్పాడీ రన్ మెషీన్. ‘నా సుదీర్ఘ కెరియర్లో ఎందరో బౌలర్లు నాకు సవాల్ విసిరారు.
Virat Kohli picks the toughest bowlers to face:
Test cricket – Jimmy Anderson.
ODIs – Malinga (Adil Rashid toughest spinner).
T20s – Sunil Narine.pic.twitter.com/xOC1h17xLD— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2025
అయితే.. వాళ్లలో కొందరు మాత్రమే నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కొన్నిసార్లు భయపెట్టారు కూడా. టెస్టుల విషయానికొస్తే ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్(James Anderson) బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టంగా అనిపించేది. టీ20ల్లో సునీల్ నరైన్(Sunil Narine) చాలా టఫ్ బౌలర్. 15 ఏళ్లుగా అతడిని గమనిస్తున్నా. కానీ, ఇప్పటికీ అతడి బౌలింగ్ నాకు అంతుచిక్కడం లేదు. ఇక వన్డేల్లో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ, అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లను ఎదుర్కోవడం కష్టంగా తోచేది’ అని కోహ్లీ తెలిపాడు.
“𝙰𝚒𝚗’𝚝 𝚗𝚘 𝚘𝚗𝚎 𝚕𝚒𝚔𝚎 𝚑𝚒𝚖.” 💪
5️⃣0️⃣0️⃣+ runs in 8️⃣ different seasons – colossal, consistent, the King of this league! 👑🔥 pic.twitter.com/hVk9P5dVT2
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 4, 2025
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన విరాట్ కోహ్లీ నిరుడు వరల్డ్ కప్ విజేతగా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే.. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాలనే కసితో ఆడుతున్న కోహ్లీ.. 18వ ఎడిషన్ 11 మ్యాచుల్లో 505 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధ శతకాలు ఉన్నాయి. విరాట్‌తో పాటు టాపార్డర్, బౌలర్లు నిలకడగా రాణిస్తుండడంతో బెంగళూరు 8 విజయాలతో పాయింట్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.