దుగ్గొండి, మే, 23: మండలంలోని గత 14 సంవత్సరాలుగా సీర్పీగా విధులు నిర్వహిస్తూ ఇటీవల కాంట్రాక్టు ఉపాధ్యాయునిగా పదోన్నతి పొందిన గంగారపు భాస్కర్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ సంఘాలు 2 లక్షల 50 వేల రూపాయలను వారి కుమార్తెల పేరు మీద పిక్స్ డిపాజిట్ చేసి, వాటి పత్రాలను వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎస్. వెంకటేశ్వర్లు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు పోలోజు భిక్షపతి, ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ వీరన్న, పరుపాటు సుధాకర్ రెడ్డి, రఘు, శ్యాం ప్రసాద్, గీత, శోభన్ బాబు, సరిత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
NASA | మార్స్-జుపిటర్ గ్రహాల మధ్య ఘనీభవించిన మహాసముద్రం..! నాసా అధ్యయనంలో కీలక విషయాలు..!
Olive Oil | వంట నూనెల్లో ది బెస్ట్ ఆయిల్ ఇది.. దీన్ని వాడారంటే మీకు ఎలాంటి వ్యాధులు ఉండవు..!
Siddipet | అప్పనపల్లి బాబు అపహరణ కేసు.. చిన్నారిని చంపి బావిలో పడేసిన తల్లి