Foriegn Wine | మెదక్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పరిధిలో భారీ మొత్తంలో విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా విదేశీ మద్యాన్ని నిలువ చేసినట్టు ఎక్సైజ్ అధికారులకు నమ్మదగిన సమాచారం రావడంతో దాడులు చేసి మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కాగజ్ మద్దూర్ మారేడిబయో ప్రైవేట్ ఇండస్ట్రీలో రూ.40 లక్షల విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అధికారులు
నలుగురిని అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
మారేడి బయో ప్రైవేట్ ఇండస్ట్రీలో..
మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ ఆదేశాల మేరకు నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామంలో గల మారేడి బయో ప్రైవేట్ ఇండస్ట్రీలో లిక్కర్ స్టాక్ ఉన్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నర్సాపూర్ సీఐ గులామ్ మహమ్మద్తోపాటు సిబ్బందితో కలిసి దాడులు చేయగా 783 సెవెన్ ఫిఫ్టీ (750ml) ఎంఎల్ మద్యం బాటిళ్లు లభించినట్లు అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
వాటిపై తెలంగాణకు సంబంధించిన ఎటువంటి లేబుల్ లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకొని పరిశ్రమలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని అరెస్టు చేసి విచారణ చేయగా.. మద్యం బాటిళ్లు టీసీడీ సనత్ నగర్ నుంచి జనవరి నెలలో పరిశ్రమకు వచ్చినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
మద్యం బాటిళ్ల విలువ సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుందని అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బయో ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న కొంగరి రమేష్, అభయ్ కుమార్, నాగుల్ మీరా, కుమార్ సాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీసుకొచ్చారు.. ఎక్కడ అమ్మకం చేస్తున్నారని దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు.
‘డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలి’
Cinema Is Dead | రాజమౌళితో మహేశ్ బాబు ఫైటింగ్.. AIతో సినిమా చనిపోయిందంటూ వర్మ పోస్ట్