Donald Trump | వరంగల్ చౌరస్తా, ఆగస్టు 13 : అమెరికా సామ్రాజ్యవాదం నుండి మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సంయుక్త కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు అన్నారు. బుధవారం జాతీయ సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన సామ్రాజ్యవాద శక్తుల వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ చౌరస్తాలో ఆల్ ట్రేడ్ యూనియన్స్, రైతు సంఘాల ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా పలువురు రైతు సంఘాల నాయకులు, యూనియన్ల నాయకులు మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై తన పెత్తనాన్ని ప్రదర్శించడం కోసం దేశ సార్వభౌమాధికారాన్ని మంట కలుపుతున్నాడని అన్నారు. తన వ్యాపార పెత్తనం కోసం భారత్‌పై 50 శాతం పన్నులు విధించడం మూలంగా భారతదేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.
అమెరికా తన ఆధిపత్యం కోసం ఇంత చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ పరిస్థితికి కారణాన్ని మోడీ ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు బ్రతికే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్మిక, రైతు సంఘాల నాయకులు రామస్వామి, సోమిరెడ్డి శ్రీనివాస్, ఈసంపల్లి బాబు, ఆక్కనపల్లి యాదగిరి, నర్ర ప్రతాప్, వీరగోని శంకరయ్య, చిర్రా సూరి, తిరుపతి, కోరబోయిన కుమారస్వామి, మాలోతు సాగర్, ఎండీ యాకుబ్, బొట్ల శ్రీనివాస్, సుంకా మొగిలి, ఎండీ మెహబూబ్ పాషా, మల్లికార్జున్, ఓదెలు, రత్నం, తదితరులు పాల్గొన్నారు.
Heavy Rains | అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సై కీలక ఆదేశాలు
Road Repair | ఆదమరిస్తే అంతే.. సారూ ఈ రోడ్లకు జర మరమ్మతులు చేయించండి
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు అవస్థలు