 
                                                            న్యూశాయంపేట, అక్టోబర్ 31 : మొంథా తుఫాన్ ప్రభావితంతో నీట మునిగిన వరంగల్ గ్రేటర్ పరిధి 49వ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీ వాసులకు తాపీ మేస్త్రి యాదగిరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. గత రెండు రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా వరద నీరు అంతా కమ్మేయడంతో పస్తులు ఉంటున్న నిరుపేదలకు తాపీ మేస్త్రి ముందుకు వచ్చి నేను సైతం అంటూ ఆహార ప్యాకెట్లు అందజేసి సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మేస్త్రి యాదగిరికి ఇందిరమ్మ కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Sridhar Babu | అజారుద్దీన్‌కు మంత్రిపదవి.. పాపం.. శ్రీధర్ బాబుకూ సమాచారం లేదట.. మీడియాలోనే చూశారట
Azharudddin | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు అజారుద్దీన్ కౌంటర్
 
                            