హనుమకొండ, జూన్ 19 : హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని పలు ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరిశీలించారు. ఇటీవల హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన స్నేహ శబరీష్ కలెక్టరేట్లోని పరిపాలన విభాగం, డీఈ సెక్షన్లతోపాటు ఎలక్షన్ సెల్, మినీ కాన్ఫరెన్స్‌హాల్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, చైల్డ్‌కేర్ సెంటర్, రికార్డు రూమ్, ఎన్ఐసి, వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించి అధికారులను కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, కలెక్టరేట్ ఏవో గౌరీ శంకర్, అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు
Bomb Threat | ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీ సిద్ధం.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపులు
Thug Life: థగ్ లైఫ్ రిలీజ్ చేయాల్సిందే.. కర్నాటకకు సుప్రీంకోర్టు ఆదేశాలు