Hyderabad | మాదన్నపేట, జూన్ 19 : గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసల్‌బండ వద్ద కొన్ని రోజులుగా ముగ్గురు మహిళలు ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తునట్లు సమాచారం అందిందన్నారు. బుదవారం రాత్రి సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ముగురు మహిళలను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ బైక్‌ను కూడా సీజ్ చేసి సంతోష్ నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.