Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Bengaluru airport) మరోసారి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఆగంతకులు విమానాశ్రయ భద్రతా దళానికి బెదిరింపు మెయిల్ పంపారు. టాయిలెట్ పైప్‌లైన్‌లో బాంబు ఉంచినట్లు అందులో పేర్కొన్నారు. ఒకవేళ ప్లాన్ ఏ విఫలమైతే, తమ వద్ద ప్లాన్ బీ ఉందని హెచ్చిరించారు. అంతేకాదు ‘ఉగ్రవాది అజ్మల్ కసబ్ (Ajmal Kasab)ను ఉరితీయడం తప్పు’ అంటూ అందులో ప్రస్తావించారు.
బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపులుగా నిర్ధరించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐడీ ఆధారంగా ఆగంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు రావడం ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జూన్ 13, జూన్ 16 తేదీల్లో కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్సే వచ్చాయి. ఇక ఈనెల 6వ తేదీన బెంగళూరులోని కోరమంగళలో గల ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, సీఎం నివాసానికి ఇదే విధమైన బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఐఈడీలతో ఆత్మాహుతి బాంబర్లు దాడి చేస్తారని హెచ్చరించారు. ఆయా ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Shubhanshu Shukla | శుభాన్షు రోదసి యాత్ర.. కీలక అప్డేట్ ఇచ్చిన నాసా
Air India | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బ్లాక్‌బాక్స్.. విశ్లేషణ కోసం విదేశాలకు
Air India | ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో కోత