తుంగతుర్తి, మార్చి 12 : తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యతండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ లకావత్ మాన్సింగ్ ఇటీవల ఆరోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించాడు. గురువారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుంజ యుగంధర్ రావు, మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, కలెట్లపెళ్లి ఉప్పలయ్య, కొమ్మినేని సతీష్, భిక్షం నాయక్, రాములు నాయక్, రవి నాయక్, ఆకారపు భాస్కర్ పాల్గొన్నారు.