Air India | ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో కోత
Air India | దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. తన అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
Air India | దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. తన అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వైడ్‌బాడీ విమాన (widebody aircraft) కార్యకలాపాలను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సుమారు 15 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
వైడ్‌బాడీ బోయింగ్ 777 విమానాల్లో మరింతగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అనేక సంక్లిష్ట సవాళ్ల మధ్య మెరుగైన సామర్థ్యం, ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా తన ప్రకటనలో స్పష్టం చేసింది. బోయింగ్ 777 విమానాల్లో చేపట్టే ఈ ప్రత్యేక తనిఖీల ద్వారా ప్రయాణ భద్రతను మరింత పటిష్టం చేయడమే తమ లక్ష్యమని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా (Air India) సమస్యల వలయంలో చిక్కుకొన్నది. మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరవకముందే ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో సంస్థ ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు చేపడుతోంది. ఈ క్రమంలో నిర్వహణపరమైన ఇబ్బందులతో గడిచిన ఆరు రోజుల్లో సంస్థకు చెందిన దాదాపు 83 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్లు సమాచారం.
Also Read..
IndiGo | ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
Microsoft | మైక్రోసాఫ్ట్‌లో మరో రౌండ్ లేఆఫ్స్.. వేలాది మందిపై ప్రభావం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

