IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య (technical issue) తలెత్తింది. ఇండిగోకు చెందిన 6E 2006 విమానం గురువారం ఉదయం ఢిల్లీ నుంచి లెహ్ (Delhi to Leh)కు బయల్దేరింది. అయితే, మధ్యలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఢిల్లీలో అత్యవసరంగా (emergency landing) సేఫ్ ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, క్రూ సిబ్బంది మొత్తం 180 మంది ఉన్నారు. ఈ విషయాన్ని ఇండిగో సంస్థ కూడా ధ్రువీకరించింది. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
కాగా, నిన్న ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ వెళ్లిన ఇండిగో విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. విమానం రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వగా.. విమానం డోర్లు తెరుచుకోలేదు. దీంతో దాదాపు 40 నిమిషాల పాటూ ప్రయాణికులు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్, ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే, మేయర్ కూడా ఉన్నారు. ఇలా వరుస ఘటనలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..
Microsoft | మైక్రోసాఫ్ట్‌లో మరో రౌండ్ లేఆఫ్స్.. వేలాది మందిపై ప్రభావం..!