Air India Plane Crash | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి (Ahmedabad Plane Crash) నేటికి వారం రోజులు. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వారం రోజులైనా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. డీఎన్ఏ పరీక్ష (DNA Samples) ద్వారా ఇప్పటి వరకూ 210 మంది బాధితుల వివరాలను గుర్తించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇవాళ ఉదయం 8:30 గంటల వరకూ (19వ తేదీ) 210 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించినట్లు వెల్లడించారు. అందులో 187 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. మిగతా డెడ్‌బాడీస్ అప్పగింత ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్‌లో డీఎన్ఏ ప్రయోగశాల 24 గంటలూ పనిచేస్తోంది. ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తున్నదని.. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతున్నదని వైద్యులు తెలిపారు.
Also Read..
Operation Sindhu | ఇరాన్ నుంచి భారత్‌కు చేరిన 110 మంది విద్యార్థులు
Assembly Bypolls | నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్