వరంగల్ చౌరస్తా : వరంగల్ మోడల్ బస్టాండ్ నిర్మాణ సంస్థ కేబీఎన్ కన్ష్ట్రక్షన్ పై ఇంతేజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు సంస్థ మంగళవారం మధ్యాహ్న సమయంలో ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా పేలుడు పదార్థాలను (జిలిటన్ స్టిక్స్) వినియోగించి పేలుళ్లు జరిపింది. దీంతో ఎగిరి పడిన బండరాయి తాత్కాలిక బస్టాండ్ లో నిలిపి ఉన్న భూపాలపల్లి బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఈ ఘటనలో డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిం చిన కారణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు కాంప్రెసెర్ ట్రాక్టర్స్, 36 జిలిటన్ స్టిక్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సి.ఐ శుఖుర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Etihad Airways | భారతీయులకు ఎతిహాద్ ఎయిర్వేస్ బంపర్ ఆఫర్.. విమాన టికెట్లపై 30% డిస్కౌంట్
NTR| ఎన్టీఆర్ తన భార్యని ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా.. వైరల్ అవుతున్న బర్త్ డే పిక్స్
V15 Shoot Begins | వరుణ్ తేజ్ ఇండో కొరియన్ డ్రామా.. ఇంట్రెస్టింగ్గా అనౌన్స్మెంట్ వీడియో