Varun Tej | మెగా హీరో వరుణ్ తేజ్‌కి ఈ మధ్య అసలు కలిసి రావాట్లేదన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఫిదా, తొలిప్రేమ సినిమాలతో సాలిడ్ హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో కెరీర్ గ్రాఫ్ సడన్‌గా పడిపోయింది. ఆపరేషన్ వాలంటైన్, గాండీవ ధారి అర్జున, గని, మట్కా సినిమాలతో వరుస డిజాస్టార్లను అందుకున్నాడు. ఇదిలావుంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం యాక్షన్ సినిమాలను పక్కనపెట్టి కొత్త జానర్లో సినిమా చేయబోతున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
#వీ15 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రితికా నాయక్ కథానాయిక. ఈ చిత్రం గత సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఇండో కొరియన్ హారర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో కమెడియన్ సత్య కీలక పాత్రలో నటించబోతున్నాడు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి చిత్రయూనిట్ షూట్ బిగిన్స్ అంటూ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది.
ఈ వీడియోలో వరుణ్ తేజ్ వరుస ఫ్లాప్‌లతో బాధపడుతూ.. చీకట్లో కూర్చునట్లు ఉండగా.. సత్య వచ్చి వరుణ్ తేజ్‌ని మోటివేషన్ చూడవచ్చు. ఫన్నీగా సాగిన ఈ వీడియోను మీరు చూసేయండి.