అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘విసా-వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ సినిమా నుంచి తొలిగీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదలైంది. సనారె సాహిత్యాన్నందించిన ఈ పాటకు విజయ్ బుల్గానిన్ సాహిత్యాన్నందించారు.
‘అనగా అనగా అమెరికా.. కథ మొదలిక..మది గదులను తెరవగా..’ అంటూ భావయుక్తంగా ఈ పాట సాగింది. నాయకానాయికల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ, హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో సాగే చక్కటి కుటుంబ కథా చిత్రమిదని మేకర్స్ తెలిపారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, దర్శకత్వం: ఉద్భవ్ రఘు.