గోధుమ పిండి: కప్పు
పాలపొడి : కప్పు
బేకింగ్ పౌడర్ : పావు స్పూను
ఉప్పు : చిటికెడు
పంచదార : ఒకటిన్నర కప్పు
కుంకుమపువ్వు: కొద్దిగా
యాలకులు: రెండు మూడు
నెయ్యి: అర స్పూను
నూనె: వేయించడానికి సరిపడా
ముందుగా గిన్నెలో పంచదార వేసుకుని ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి. పాకం కాస్త చిక్కపడేదాకా అంటే ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆ నీళ్లను మరగనివ్వాలి. అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, దంచిన యాలకులు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాత్రలోకి గోధుమ పిండిని, పాలపొడిని తీసుకొని అందులో ఉప్పు, బేకింగ్ సోడా కూడా వేసి నీళ్లు చల్లి గులాబ్ జామ్ మిక్స్‌ను కలిపినట్టుగానే మృదువుగా కలుపుకోవాలి. దీన్ని ఒక పది పదిహేను నిమిషాల సేపు పక్కకు పెట్టుకోవాలి.
తర్వాత పిండిని గులాబ్ జామ్ లాగా చిన్నచిన్న ఉండలుగా ఒత్తుకోవాలి. కాస్త భిన్నంగా కనిపించాలి అనుకుంటే పొడవుగాను వీటిని చేసుకోవచ్చు. చేసేటప్పుడు అర చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు, పొయ్యి మీద బాణలి పెట్టి మీడియం హీట్‌లో ఈ ఉండలను బంగారు రంగు వచ్చేలాగా వేపుకోవాలి. ఇందాక పట్టి పెట్టుకున్న పాకంలో ఈ ఉంబలని వేసి కాసేపు ఊరనిస్తే గోధుమపిండి గులాబ్ జామ్ రెడీ!