NTR| ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ వార్2 చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. రోజు రోజుకి ఎన్టీఆర్ ఖ్యాతి పెరుగుతూ పోతుంది. ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర చిత్రం మార్చి 28న జపాన్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కోసం తన సతీమణితో కలిసి జపాన్‌లో వాలారు జూనియర్. గత రెండు మూడు రోజులుగా అక్కడి వారితో కలిసి తెగ సందడి చేస్తున్నాడు. అయితే ప్రణతి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి జరిగిన వేడుకలకి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ అమ్ములు.. హ్యాపీ బర్త్ డే అంటూ ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తెలిపారు.ఈ పోస్ట్‌తో జూనియర్ తన భార్యని ముద్దుగా అమ్ములు అని పిలుచుకుంటాడు అని అర్ధమైంది.
గత ఏడాది కూడా ఎన్టీఆర్ తన భార్యకి హ్యాపీ బర్త్ డే అమ్ములు అని విషెస్ చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. 2011లో ఎన్టీఆర్‌తో ప్రణతికి పెళ్లైంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. తారక్ షూటింగ్స్ కు ఏ మాత్రం గ్యాప్ దొరికిన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకి వెళుతుంటారు. అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో కలిసి చేస్తున్న సందడికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే తారక్ చివరిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రంతో పలకరించాడు.
దేవర సినిమా రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి పార్ట్ పెద్ద హిట్ అయింది. దివంగత శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జానీకపూర్ ఈ చిత్రం ద్వారానే తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లని రాబట్టింది. ఇక తర్వలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటించనున్నాడు. జపాన్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నాడని అంటున్నారు. త్వరలో వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఎన్టీఆర్.